వంటగదిలో 14 పాము పిల్లలు.. పెద్ద పాము మాత్రం కనిపించట్లేదు..
వంట గదిలో 14 పాము పిల్లలు కనిపించాయి. ఈ ఘటన భువనేశ్వర్, జాజ్‌పూర్ జిల్లా సారంగపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సారంగపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోని వంట గదిలో 14 పాము పిల్లలు దర్శనమిచ్చాయి. వివరాల్లోకి సారంగపూర్‌కు చెందిన పద్మలోచన మహింది అనే వ్యక్తి ఇంట్లో పాము సంచరిస్తుండడం చూసి కుటుంబ సభ్యులు భయంతో ఇంటి నుంచి బయటికి పరుగులు తీశారు.
దీంతో స్నేక్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించడంతో హెల్ప్‌లైన్ సభ్యులు పద్మలోచన ఇంటిని పరిశీలించారు. వంటింట్లోని గ్యాస్ సిలిండర్ కింద ఉన్న ఓ రంధ్రంలో పాము పిల్లలు ఉన్నట్లు వారు గుర్తించారు. ఆ రంధ్రం ఉన్న ప్రాంతాన్ని తవ్వగా అందులో 14 పాము పిల్లలు దర్శనమిచ్చాయి. దీంతో హెల్ప్‌లైన్ వాళ్లు ఆ పాములను పట్టుకొని అడవిలో వదిలేశారు. కానీ పెద్ద పాము మాత్రం దొరకలేదు.