శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (08:26 IST)

పశ్చిమ బెంగాల్‌లో భీకరవర్షం : పిడుగులుపడి 20 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపించింది. సోమవారం కురిసిన భీకర వర్షానికి 20 మంది మృత్యువాతపడ్డారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతోపాటు తీవ్రమైన గాలులతో కూడిన వర్షం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. 
 
అకస్మాత్తుగా కురిసిన ఈ వానలకు 20 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ముర్షీదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున, తూర్పు మేదినీపూర్ జిల్లాలో ఇద్దరు పిడుగులు పడి చనిపోయినట్టు పేర్కొన్నారు. 
 
వర్షాలకు 20 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.