మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (17:57 IST)

వెస్ట్ బెంగాల్‌లో 10, 12 తరగతుల పరీక్షలు రద్దు : సీఎం మమత వెల్లడి

కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ యేడాది 10వ తరగతి (మాధ్యమిక్), 12వ తరగతి (ఉచ్ఛ మాధ్యమిక్) బోర్డు పరీక్షలను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. 
 
ఈ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  సోమవారంనాడు ప్రకటించారు. దీనికి ముందు, జూలై చివరి వారంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు జూలైలోనూ, 10వ తరగతి బోర్డు పరీక్షలు ఆగస్టు రెండో వారంలోనూ జరుపుతామని మమతా బెనర్జీ ప్రకటించారు. 
 
అయితే, కోవిడ్ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి సోమవారం ప్రకటించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెల్సిందే.
 
ఇదిలావుంటే, బెంగాల్‌లో ఆదివారం 7,002 మందికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 14,26,132కు చేరింది. కొత్తగా 107 మంది మృత్యువాత పడటంతో కరోనా మృతుల సంఖ్య 16,259కి చేరింది.