‘గే’ని పెళ్లి చేసుకునేందుకు 73 దరఖాస్తులు..!! అదేమీ తప్పు కాదంటున్న హరీష్
‘మా అబ్బాయికి వరుడు కావలెను’ అనే పెళ్లి ప్రకటన వచ్చిందో లేదో.. స్పందనలు ఎక్కువగానే ఉన్నాయి. హరీష్ తల్లి ఇచ్చిన ప్రకటనకు 73 స్పందించారు. తాము సిద్ధమంటూ దరఖాస్తు చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
‘గే వరుడు కావలెను’ అంటూ ప్రచురితమై.. సోషల్‌మీడియాలో హల్చల్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుంచి 73 ప్రపోజల్స్ వచ్చాయని గే హరీష్ తల్లి, పద్మ అయ్యర్ తెలిపారు. ప్రకటనలో తెలిపినట్లుగా ఎక్కువమంది అయ్యర్లే ప్రతిస్పందించారని ఆమె చెప్పారు.
ఈ ప్రకటనకు వచ్చిన స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందని హరీష్ తెలిపారు. ఆస్టేలియా, యూకే, యూఎస్ తో పాటు సౌదీ అరేబియా నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. అయ్యర్లతోపాటు గుజరాతీలు, ముస్లింలు చాలా మంది మెయిల్ చేశారని హరీష్ తెలిపారు. అబుదాబి నుంచి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటే ఆయనకున్న రాజభవనంలాంటి ఇల్లు రాసిస్తానన్నారని హరీష్ చెప్పారు.