90ఏళ్ల తండ్రికి పెళ్లి చేసిన ఐదుగురు కుమార్తెలు.. ఎక్కడ?
అతని వయస్సు 90 సంవత్సరాలు. భార్య చాలాకాలం క్రితం మృతి చెందింది. చిన్నవ్యాపారం చేస్తు తన ఐదురుగు కుమార్తెలకు పెండ్లీలు చేసి పంపించేశాడు. అయితే అతను ఒంటరిగా ఉండడం చూసిన కూతుర్లు బాధపడ్డారు. అతనికి వెంటనే మరో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా 75 ఏళ్ల ఓ మహిళతో అతనికి వివాహం జరిపించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జనపథ్ రామ్‌పూర్ పరిధిలోని నర్ఖేడీ నివాసి షఫీ అహ్మద్ కు 90 ఏండ్లు. భార్య మరణించింది. వారికి అయిదుగురు కుమార్తెలు. చిరు వ్యాపారం చేస్తూ పిల్లలందరి పెండ్లీలు చేసి వారి అత్తగారిండ్లకు అహ్మద్.. ప్రస్తుతం ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నారు. అతన్ని చూసుకునేవారు లేక కుమార్తెలు బాధపడ్డారు. వారి తండ్రికి మళ్లీ పెండ్లి చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 75 ఏండ్ల అయేషా అనే మహిళతో వివాహం జరిపించారు.