ఉరేసుకుని బాలిక ఆత్మహత్య... మైనర్ లైంగికదాడి చేశాడు.. 4 రోజుల పాటు ఇతే తంతు..
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ మైనర్ చేతిలో లైంగికదాడికి గురైన ఓ ఏడేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే మూడో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 15వ తేదీన ఉరేసుకుని ఆత్
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ మైనర్ చేతిలో లైంగికదాడికి గురైన ఓ ఏడేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే మూడో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 15వ తేదీన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. టీచర్లు మందలించినందుకే బాలిక ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ పోస్టు మార్టం రిపోర్టులో ఆ బాలిక లైంగికదాడికి గురైనట్లు వెల్లడైంది.
ఈ రిపోర్టులో బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు నాలుగు రోజుల ముందు నుంచి ఆమెపై లైంగికదాడి జరిగిందని తేలింది. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ బాలిక ఇంట్లోనే అద్దెకుంటున్న బాలుడు ఆమెపై లైంగిక దాడి జరిపాడని తెలిపారు.
ఆగస్టు 12న బాలిక ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆ బాలుడు ఆమెపై మొదటిసారి లైంగికదాడి జరిపాడని పోలీసులు తెలిపారు. బాలిక ఆత్మహత్య చేసుకున్న రోజు వరకూ ఆమెపై పలుమార్లు లైంగికదాడిని కొసాగించాడన్నారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని అరెస్టు చేశారు.