గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (22:17 IST)

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

papaya leaves
బొప్పాయి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో పీచుపదార్థాలతో పాటు పపైన్ అనే జీర్ణ ఎంజైమ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బొప్పాయి తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి.
బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది.
బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది.
బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. 
బొప్పాయి పాలల్లో కొబ్బరినూనె లేదా నెయ్యి కలిపి గజ్జి, చిడుము వంటి చర్మవ్యాధులపై పూయడం వల్ల అవి తగ్గిపోతాయి.
ముసాంబరాన్ని బొప్పాయి పాలతో నూరి సెనగగింజంత మాత్రలు చేసి రెండు పూటలా ఒక్కో మాత్ర తీసుకుంటుంటే స్త్రీలలో ఋుతుక్రమం బాగా విడుదలవుతుంది.
బొప్పాయి కాయను కొబ్బరికోరులా తరిగి కొద్దిగా ఆముదం కలిపి వేడి చేసి స్తనాల్లో గడ్డలుపై వేసి కట్టుకడుతుంటే నొప్పులు, పోటు తగ్గుతాయి.