శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (16:56 IST)

ఉల్లాసంగా వున్నందుకు రూ.500 అడిగిన మహిళ.. చేతిలో వున్నదేమో రూ.60?

ఆ మహిళతో పడకసుఖం పంచుకున్నాడు. ఉల్లాసంగా ఉన్నాడు. అయితే ఆ మహిళ అతడి వద్ద రూ.500లు అడిగింది. దీంతో ఆగ్రహావేశానికి గురైన ఆ వ్యక్తి రాళ్లతోనే మహిళను కొట్టి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విలుప్పురం సౌత్ రైల్వే కాలనీకి చెందిన ఓ భవనంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చెందిన ఎవరో ఈ పని చేసివుంటారని పోలీసులు అనుమానించారు. ఈ కోణంలోనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఈ క్రమంలో 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద జరిపిన విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన మహిళతో ఉల్లాసంగా గడిపానని.. ఆమె భిక్షురాలని చెప్పాడు. 
 
కానీ సదరు మహిళ ఉల్లాసంగా ఉన్నందుకు ఐదు వందల రూపాయలు అడిగిందని.. తన వద్ద 50 రూపాయలు మాత్రమే వుందని చెప్పినా పట్టించుకోకుండా గొడవకు దిగిందని చెప్పాడు. చివరికి ఆవేశంలో ఆమె రాళ్లతో కొట్టి చంపేశానని ఒప్పుకున్నాడు.