శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2023 (12:31 IST)

మహిళ ప్రాణాలు తీసిన మూఢనమ్మకం... ఎక్కడ?

deadbody
మూఢ నమ్మకం ఓ మహిళ ప్రాణాలు తీసింది. ఓ మహిళకు దెయ్యం పట్టింది. దీన్ని తొలగిస్తానని నమ్మించిన ఓ తాంత్రికుడు ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో ఆ మహిళ అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలోని పత్వారియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రియ సక్సేనాను ఆరు సంపత్సరాల క్రితం ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. కొంతకాలం తర్వాత భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో ఆమె భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె కొన్ని రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఈ క్రమంలో  ఓ తాంత్రికుడితో పరిచయం ఏర్పడింది. వారి కుటుంబం గురించిఅతడు పూర్తిగా తెలుసుకున్నాడు.
 
ప్రియ పరిస్థితిని అర్థం చేసుకుని, ఆ కుటుంబానికి మాయమాటలు చెప్పాడు. ప్రియకు దెయ్యం ఆవహించిందని తాను దానిని వదిలిస్తానని ఆ కుటుంబ సభ్యులను నమ్మించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా అతని మాటలు నమ్మారు. హోమం చేయాల్సి ఉంటుందని చెప్పి శనివారం ఇంట్లోనే అందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆ మాంత్రికుడు ఉత్తుత్తి మంత్రాలు చదవుతూ.. ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో తీవ్ర అనారోగ్యం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.