1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:41 IST)

'హిజాబ్' అనేది ముస్లిం మహిళ గుర్తింపు - లా బోర్డు

కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. అయితే, హిజాబ్ మహిళలకు వ్యతిరేకంగా నిరసనల పేరుతో ద్వేషాన్ని రెచ్చగొడుతూ వ్యాప్తి చేస్తున్న వ్యక్తులను ఎదుర్కోవడానికి ముస్లిం మహిళలు తప్పనిసరిగా ముందుకురావాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. 
 
"నా ప్రియమైన సోదరీమణులారా... హిజాబ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి, పక్షపాతాన్ని పారద్రోలడానికి, మీరు హిజాబ్‌తో అణిచివేయడలేదని, కానీ, దాంతో గౌరవంగా, స్వేచ్ఛగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీ విజయం ముస్లిందరి విజయం" అంటూ సోషల్ మీడియాలో లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఉమ్రైన్ మహపూజ్ రహ్మానీ పిలుపునిచ్చారు. హిజాబ్ అనేది ముస్లిం మహిళ గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు.