శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (20:47 IST)

తిరుచ్చిలో ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్.. ప్రయాణికులకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది..

air india flight
తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానంలో హైడ్రాలిక్‌ వ్యవస్థ పనిచేయలేదు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పైలెట్లు ఎమర్జెన్సీ ప్రటించారు. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో పెద్దసంఖ్యలో పారా మెడిక్‌ సిబ్బంది, 20 ఫైర్‌ ఇంజిన్లు, 20 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. పైగా, ల్యాండిగ్ సమస్య ఉత్పన్నం కావడంతో గంటన్నరకుపైగా గాల్లోనే చక్కర్లు విమానాన్ని పైలెట్లు చక్కర్లు కొట్టించారు. అయితే, పైలెట్లు చాకచక్యంగా విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశారు. దీంతో ఏఎక్స్‌బీ 613 విమానంలోని 141 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. 
 
అంతకుముందు తిరుచ్చి విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఈ విమానం షార్జాకు వెళ్లకుండా తిరిగి తిరుచ్చికే వచ్చింది. అయితే, విమానం ల్యాండింగ్ కావడంలో సమస్య ఏర్పడింది. దీంతో విమానం గాల్లోలోనే చక్కర్లు కొట్టించారు. ఈ విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హైడ్రాలిక్‌ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో సురక్షిత ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. దాదాపు 2 గంటల 5 నిమిషాల పాటు గగనతలంలో చక్కర్లు కొట్టిన తర్వాత విమానాన్ని సురక్షితంగా పైలెట్లు ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులతో పాటు.. ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.