సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (13:01 IST)

హీరో అజిత్‌ కంపెనీకి కీలక ప్రాజెక్టును అప్పగించిన భారత రక్షణ శాఖ

కోలీవుడ్ హీరో అజిత్‌కు భారత రక్షణ శాఖ కీలక ప్రాజెక్టును అప్పగించింది. రక్షణ శాఖకు కావాల్సిన డ్రోన్లను తయారు చేసి ఇచ్చే బాధ్యతను అజిత్ సారథ్యంలోని కంపెనీకి కట్టబెట్టింది. అజిత్ సారథ్యంలో మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఏరోస్పేస్ ప్రయోగాలు చేసే విద్యార్థి బృందం పేరు 'దక్ష'.' అజిత్ తొలుత వారితో కలిసి డ్రోన్ ట్యాక్సీ, డ్రోన్ అంబులెన్స్‌లను తయారుచేశారు. 
 
ఎక్కువ బరువును మోస్తూ తక్కువ కాలంలో గమ్యస్థానానికి చేరే ఆ డ్రోన్ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ప్రపంచ పోటీలో రెండో స్థానంలో నిలవడం విశేషం. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు సైతం రక్తాన్నీ, ఔషధాలనూ చేరవేసే ఆ డ్రోన్లకు 2019లో దేశవ్యాప్తంగా జరిగిన డ్రోన్ ఒలింపిక్స్‌లో ప్రథమ బహుమతి వచ్చింది. 
 
కొవిడ్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో రసాయనాలు చల్లడానికి అజిత్ తన బృందంతో కలిసి సాఫ్ట్‌వేర్ ఆధారంగా పెట్రోలుతో నడిచే ఓ డ్రోన్‌ను తయారు చేశారు. ఈ డ్రోను తమిళనాడు ఉపయోగించుకుంది. దక్ష బృందం గురించి తెలిసిన భారత రక్షణ శాఖ.. నిఘా కోసం డ్రోన్లను తయారు చేయమని 'దక్ష'ను కోరింది. యేడాదిలో దాదాపు 200 డ్రోన్లను తయారు చేసే ఈ కాంట్రాక్టు విలువ రూ.170 కోట్లు. ఈ డ్రోన్‌ను భారత్ - పాక్ సరిహద్దుల్లో నిఘా, ఇతర సహాయక చర్యల కోసం వినియోగించనున్నారు.