శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (19:10 IST)

జియోకి ముఖేష్ అంబానీ రాజీనామా.. చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ

Akash Ambani
Akash Ambani
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రిలయన్స్ జియో ప్రకటించింది. రిలయన్స్ జియో చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. 
 
జూన్ 27వ తేదీన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖేష్ జూన్ 27వ తేదీన అంబానీ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు టెల్కో తెలిపింది. 
 
2022, జూన్ 27వ తేదీ నుంచి డైరెక్టర్‌లుగా రమీందర్ సింగ్, కేవీ చౌదరిగా కొనసాగనున్నారు. ఇందుకు షేర్ హోల్డర్స్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. వీరి పదవికాలం ఐదేళ్లు. 
 
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌లుగా పంకజ్ మోహన్ పవార్ నియామకాన్ని బోర్డు ఆమోదించింది. 2021లో నాయకత్వ మార్పుల్లో భాగంగా తన పిల్లలు బాధ్యతలు తీసుకుంటారని గతంలో అంబానీ చెప్పారు.  
 
ఆసియాలోనే అత్యంత సంపన్నులో ఒకరైన ముకేశ్ అంబానీకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 2002లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా ముకేశ్ బాధ్యతలు చేపట్టారు.  
 
అలాగే రిలయన్స్ జియో, అదనపు డైరెక్టర్లుగా రమీందర్ సింగ్ గుజ్రాల్, కెవి చౌదరిలను నియమించడానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. 
 
వాటాదారుల ఆమోదానికి లోబడి జూన్ 27,2022 నుంచి ఐదేళ్ల పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ నియామకానికి ఆమోదం తెలిపింది.