శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (15:42 IST)

మహిళలతో ఆనందేశ్వర్ పాండే అభ్యంతకర ఫోటోలు.. అసలు ఆయనెవరు?

romance
Anandeshwar Pandey
ఉత్తరప్రదేశ్ ఒలింపిక్ టీమ్ సెక్రటరీ ఆనందేశ్వర్ పాండే వివాదంలో చిక్కుకున్నారు. ఆనందేశ్వర్ పాండే అభ్యంతకర ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను వేర్వేరు మహిళలతో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ ఫోటోలు అభ్యంతరకరంగా ఉండడంతో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. దీని వల్ల పాండే కెరీర్ ప్రమాదంలో పడిందని చర్చించుకుంటున్నారు. అంతేగాకుండా ఈ వ్యవహారంపై సీఎం పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు.
  
పాండే ఫోటో విషయంలో స్పోర్ట్స్ ఆఫీసర్ కెడి సింగ్ బాబు స్టేడియం అధికారులు జిల్లా కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. ఉత్తరప్రదేశ్ ఒలింపిక్ జట్టు కార్యదర్శి ఆనందేశ్వర్ పాండే లక్నోలోని కేడీ సింగ్ బాబు స్టేడియంలో బస చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. 
 
అతని నివాసానికి సమీపంలో బాలికల హాస్టల్ ఉంది. వైరల్ ఫోటోలలో ఒకదానిలో, అతను భారత జట్టు కిట్‌లో కనిపించాడు. దీంతో రాష్ట్ర, దేశ ప్రతిష్ట దెబ్బతింటోందన్న చర్చ మొదలైంది.
 
ఈ విషయం గురించి పాండేని ప్రశ్నించగా, IOA ఆఫీస్ బేరర్లు ప్రతిష్టను చెడగొట్టారని ఆరోపించారు. లక్నో పోలీస్ కమిషనర్ సోషల్ మీడియాలో తన ప్రతిష్టను కించపరిచారని ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో భారత ఒలింపిక్ జట్టు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో పాండే కూడా నిలబడతారు. అందుకే ఈ కుట్ర జరిగిందని అంటున్నారు.