సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

చంద్రబాబుపై రాళ్లదాడి చేసిన వైకాపా ఎమ్మెల్సీ అనుచరులు

ysrcp cadre
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్వహించిన రోడ్‌షో‌లో కొందరు అగంతకులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడ్డాడు. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరో టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. రాళ్లదాడి చేసింది వైకాపా ఎమ్మెల్సీ అరుణ ప్రధాన అనుచరులైన పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్‌లు గుర్తించారు. వారికి సంబంధించిన ఫోటోలను టీడీపీ విడుదల చేసింది. రాళ్లు విసురుతున్న నిందితుల ఫోటోలను విడుదల చేసింది. 
 
తాజాగా ఈ దాడికి పాల్పడినవారు వైకాపాకు చెందినవారేనంటూ టీడీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని రాళ్లదాడికి పాల్పడినవారు పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్ అని టీడీపీ ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా వీరిద్దరూ వైకాపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రధాన అనుచరులేనని కూడా తెలిపింది. 
 
ఇందుకు సంబంధించిన ఫోటోలను టీడీపీ విడుదల చేసింది. ఓ విద్యుత్ స్తంభం ఎక్కిన కిషోర్, కార్తీక్‌లు రాళ్లు రువ్వగా, వారికి రాళ్లు అందించేందుకు కింద నిలుచుకున్న వారు రాళ్ళతో నిండి వున్న సంచుల ఫోటోలను కూడా టీడీపీ సదరు ఫోటోల్లో చూపించింది. అంతేకాకుండా, చంద్రబాబు లక్ష్యంగా రాళ్లదాడి జరిగిందని టీడీపీ ఆరోపించింది.