ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (14:06 IST)

అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అరెస్టు

anil deshmukh
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసింది. అవినీతి కేసులో దేశ్‌ముఖ్‌ను కష్టడీలోకి తీసుకునేందుకు ముంబై కోర్టు గతవారం సీబీఐకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ముంబై పోలీస్ కమిషనరుగా ఉన్న పరంవీర్ సింగ్ అప్పటి హోం మంత్రిగా అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. నగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ టార్గెట్లు విధించారని పేర్కొంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్ దేశ్‌ముఖ్‌పై కేసు నమోదు చేయాలని బాంబే హైకోర్టు గతంలోనే ఆదేశించింది. 
 
అయితే, ఈ అవినీతి కేసులో అరెస్టును తప్పించుకునేందుకు అనిల్ దేశ్‌ముఖ్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది. దీంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి బుధవారం అరెస్టు చేశారు. 
 
మరోవైపు, అవినీతి కేసులో తన కస్టడీని కోరుతూ సీబీఐ దరఖాస్తును సీబీఐ న్యాయస్థానం అనుమతించడాన్ని దేశ్‌ముఖ్ హైకోర్టులో సవాల్ చేశారు. అంతకుముందు ఇదే కేసులో దేశ్‌ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పల్నాడెలను కూడా సీబీఐ అధికారులుస అదుపులోకి తీసుకున్నారు.