ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (13:51 IST)

కతువా జిల్లాలో కుప్పకూలిన భారత ఆర్మీ విమానం

Helicopter
జమ్మూకాశ్మీర్, కతువా జిల్లాలో భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. రంజిత్ సాగర్ డ్యామ్ సరస్సు సమీపంలో భారత సైన్యం హెలికాప్టర్ కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌డి‌ఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
 
సాధారణ శిక్షణ నిమిత్తం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ నుంచి బయల్దేరిన ఈ విమానం కథువా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఆనకట్ట పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుండి 30 కి.మీ దూరంలో ఉంది. 254 ఆర్మీ ఏవియేషన్ హెలికాఫ్టర్ ఉదయం 10.20 కి బయలుదేరింది. 
 
సాగర్ డ్యాం ప్రాంతంలో లో-లెవెల్ వెళ్తూ.. ఎలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాయి.ఈ ప్రమాదంపై ఆర్మీ ఉన్నతస్థాయి వర్గాలు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.