ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (21:53 IST)

మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

అత్యాచారం కేసులో ఏఎస్‌ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించడం జరిగింది. పోలీస్‌ అధికారి అయి ఉండి మతిస్థిమితం లేని యువతిని చెరబట్టిన ఈ కామాంధునికి కోర్టు కఠిన శిక్ష విధించింది.
 
వివరాల్లోకి వెళితే.. తుమకూరు నగరం అంతరసనహళ్లి వద్ద యువతిపై ఏఎస్‌ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధిస్తూ జిల్లా 2వ సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది.
 
2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.