శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (10:00 IST)

ఫేస్‌బుక్ లైవ్‌లో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య

ఫేస్‌బుక్ లైవ్‌లో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఫేస్‌బుక్ లైవ్‌లో ఉరేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గువాహటి కలాయిన్‌కు చెంగిన జయదీప్ సిల్చార్‌లో ఓ గదిలో అద్దెకు ఉంటూ మెడికల్ సేల్స్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడు. 
 
కొన్నేళ్లుగా ఓ యువతితో ప్రేమలో వున్నాడు. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తీసుకురావడంతో జయదీప్ దూరమైంది. పెళ్లికి నిరాకరించింది. యువతి నిర్ణయం విని తట్టుకోలేకపోయిన జయదీప్ తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
తాను ఆమెను ఎంతగానో ప్రేమించానని.. పెళ్లి చేసుకుందామని అడిగితే అందరి ముందు తిరస్కరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. యువతి కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల జయదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి సోదరుడు రూపమ్ రే ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.