గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (08:54 IST)

పెళ్లికి నిరాకరించిందనీ ముఖంపై యాసిడ్ దాడి... ఎక్కడ?

అస్సాం రాష్ట్రంలోని డిబ్రూగఢ్‌లో దారుణం జరిగింది. ఓ యువతి పెళ్లి నిరాకరించిందని యువకుడు ముఖంపై యాసిడ్‌తో దాడిచేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కిరాతక చర్య వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానికంగా నివశిస్తున్న ఓ 33ఏళ్ల యువతిని పెళ్లాడాలని వ్యక్తి అనుకున్నాడు. అతని వయసు 50. ఆమె దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. దానికి ఆమె నో అని సమాధానం ఇచ్చింది.
 
అంతే ఆగ్రహం తెచ్చుకున్న అతను.. ఆదివారం ఆమె ఉద్యోగం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచి ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అస్సాం మెడికల్ కాలేజి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.