అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్న టిక్‌టాక్
టిక్‌టాక్ యాప్‌ను తక్షణమే నిషేధించాలంటూ కేంద్రన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. చైనాకు చెందిన ఈ వీడియో యాప్ పిల్లల్లో అశ్లీల (పోర్న్) ప్రవృత్తిని పెంచుతోందని కోర్టు అభిప్రాయపడింది. టిక్‌టాక్ యాప్‌లో ఉన్న వీడియోలను వాడరాదంటూ మీడియాకు కూడా కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
సంక్షిప్త వీడియోలను తీసి, వాటికి స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించి.. టిక్‌టాక్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ యాప్‌కు భారతదేశంలో సుమారు 6 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
అయితే టిక్‌టాక్ యాప్‌పై మద్రాసు హైకోర్టులోని మదురై బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. టిక్‌టాక్ యాప్‌ని వినియోగిస్తున్న పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు కోర్టు చెప్పింది. సామాజిక కార్యకర్త ముత్తు కుమార్ దీనిపై పిటిషన్ వేసారు. అలాగే, తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ యాప్‌పై నిషేధం విధించాలని కోరుతోంది.