ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (08:20 IST)

భాజపా ఎమ్మెల్యేను హత్యే చేస్తే రూ.కోటి రివార్డు

కర్నాటక రాష్ట్రంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి. కర్నాటక అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేను హత్య చేస్తే రూ.కోటి రివార్డు ఇస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ వ్యక్తితో బేరం కూడా కుదుర్చుకున్నాడు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. 
 
యహలంక బీజేపీ ఎమ్మెల్యేగా ఎస్ఆర్ విశ్వనాథ్ కొనసాగుతున్నారు. ఈయన్ను హత్య చేయాలంటూ కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ ఓ వ్యక్తితో డీల్ మాట్లాడుతున్న వీడియో ఒకటి లీకైంది. ఈ వీడియోతో కర్నాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
 
ఇందులో "ఆ బీజేపీ ఎమ్మెల్యే (విశ్వనాథ్)ను ఫినిష్ చేస్తే కోటి రూపాయలు ఇస్తాను. ఈ విషయం మనిద్దరి మధ్యే ఉంటుంది. ఎవరికీ తెలియదు" అని ఆ వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ వీడియో ఎప్పటిది? ఈ ఘటన ఎపుడు జరిగింది? అనే దానిపై స్పష్టత లేదు.