1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (09:07 IST)

సౌతాఫ్రికా నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్!

ఇటీవల సౌతాఫ్రికా నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇద్దరు బెంగుళూరులో ఉండగా, మరొకరు చండీగఢ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి డెల్టా వైరస్, మరొకరికి డెల్టా ప్లస్‌కు భిన్నమైన వేరియంట్లను గుర్తించారు. మరో వ్యక్తికి సోకిన వేరియంట్‌పై అన్వేషణ సాగుతోంది. ఈ నెల 26వ తేదీన సౌతాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన విషయం తెల్సిందే. 
 
చండీగఢ్‌కు చెందిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. పైగా అతని ఇంట్లో మరో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. వీరి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ఢిల్లీ ఎన్.సి.డి.సికి తరలించారు. ప్రస్తుతం భారత్‌తో పాటు ఇతర ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్న విషయం తెల్సిందే. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం అనేక రకాలైన ఆంక్షలు విధించింది.