సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 20 అక్టోబరు 2016 (15:09 IST)

మద్దెలచెర్వు సూరి అనుచరుడి బట్టలిప్పి బడితెపూజ... రక్తం కారేట్టు బాదిన బెంగళూర్ గ్యాంగ్

మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన అతడి ప్రధాన అనుచరుడు మధుసూధన్ రెడ్డిని హెబెట్టు మంజు గ్యాంగ్ చితక బాదింది. బెంగళూరులో భూదందాల విషయంలో తమకు అడ్డుపడుతున్నాడన్న ఆగ్రహంతో అతడిని హెబెట్టు గ్యాంగ్ కిడ్నాప్ చేసి నగరం శివారు ప్ర

మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన అతడి ప్రధాన అనుచరుడు మధుసూధన్ రెడ్డిని హెబెట్టు మంజు గ్యాంగ్ చితక బాదింది. బెంగళూరులో భూదందాల విషయంలో తమకు అడ్డుపడుతున్నాడన్న ఆగ్రహంతో అతడిని హెబెట్టు గ్యాంగ్ కిడ్నాప్ చేసి నగరం శివారు ప్రాంతానికి తీసుకెళ్లింది. 
 
అక్కడ అతడి దుస్తులు విప్పించేసి కూర్చోబెట్టి దుడ్డు కర్రలతో బాదడం మొదలుపెట్టారు. తమ సెటిల్మెంట్ల జోలికి రానని అతడు వేడుకున్నా వాళ్లు వదిలిపెట్టలేదు. కాళ్లతో మట్టగిస్తూ కర్రలతో రక్తం వచ్చేట్లు కొట్టారు. మద్దెలచెర్వు సూరి హత్యానంతరం మధుసూధన్ రెడ్డి బెంగళూరు వెళ్లిపోయి అక్కడ ఓ పేకాట క్లబ్బును నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పనిలోపనిగా భూదందాల్లోనూ తలదూర్చడంతో అతడిపై హెబెట్టు గ్యాంగ్ దాడి చేసింది.