శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (18:05 IST)

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్

గుజరాత్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ ఎన్నికయ్యారు. ఇందుకోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆదివారం సమావేశమై తమ నేతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎంపిక కోసం ఆదివారం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఘట్లోడియా నియోజకవర్గం ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు.
 
ఈ సమావేశంలో బీజేపీ అధిష్టానం పరిశీలకులుగా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. వీరి సమక్షంలో భూపేంద్ర పటేల్‌ను బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 
 
రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేల అభీష్టాన్ని గౌరవిస్తున్నట్టు పరిశీలకుల హోదాలో హాజరైన తోమర్, జోషి పేర్కొన్నారు. ఈ సమావేశానికి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా హాజరయ్యారు.