శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (14:54 IST)

టపాసులు కాల్చినందుకు చంపేశారు.. చిన్న గొడవ చినికి చినికి?

టపాసులు కాల్చినందుకు చంపేశారు. చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారింది. టపాసులు కాల్చినందుకు కొందరు వ్యక్తులు ఓ యువకుడిని కొట్టి చంపారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్‌లోని సుందరపాద ప్రాంతంలో అమరేష్ నాయక్ అనే యువకుడు దీపావళి రాత్రి టపాసులు కాలుస్తున్నాడు. 
 
అయితే, కొందరు యువకులు ఆ మార్గంలో వెళ్తూ.. టపాసులు కాలుస్తున్న అమరేష్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారి.. సుమారు 15 మంది గ్యాంగ్.. అమరేష్ మీద పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అమరేష్ నాయక్ కుటుంబసభ్యులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.