ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (09:04 IST)

పెళ్లికాని ప్రసాద్.. మొదటి రాత్రి గడిచాక పెళ్లి కూతురు జంప్, ఏమైంది?

అవును.. పెళ్లి చేసుకోవాలనుకున్న అతనికి చేదు అనుభవాలే మిగిలాయి. ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ..ఏ ఒక్కటి కుదరలేదు. దీంతో అతను మనోవేదనకు గురయ్యాడు. పెళ్లికాని ప్రసాద్‌గా మారిపోయాడు. కానీ చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎదురు కట్నం ఇచ్చి.. పేదింటి యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ.. తీరా చూస్తే.. అతనికి దిమ్మ తిరిగిపోయింది. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 
 
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో షాజహన్‌పూర్ జిల్లా పోయవాన్ పరిధిలో ఓ గ్రామంలో 34 ఏళ్ల వ్యక్తికి ఎంతోకాలంగా వివాహం జరగలేదు. పెళ్లి కోసమని అతని కుటుంబసభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఏది ఒక్కటి నిశ్చయం కాలేదు. కట్న కానుకలు ఆశించకుండా.. కట్నం ఇవ్వలేని దశలో ఉన్న పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వదిన సలహా ఇచ్చింది. ఫరూఖాబాద్‌లో ఓ పేదింటి కుటుంబం ఉందని తెలుసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాళ్ల కోరిక మేరకు పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ. 30వేలను ఇచ్చాడు. ఇక్కడే మొదలైంది అసలు కథ.
 
ఓ గుడిలో శనివారం నిరాడంబరంగా వివాహం జరిగింది. తన కల నేరివేరినందుకు అతను, అతని కుటుంబం ఫుల్ ఖుషీలో ఉంది. కానీ.. ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. వరుడింటికి పెళ్లికూతురు వచ్చింది. ఆమెతో పాటు ఇద్దరు కూడా వచ్చారు. పెళ్లయి మొదటి రాత్రి గడిచాక.. పెళ్లి కూతురు కనిపించలేదు. ఆమెతో పాటు ఉన్న ఇద్దరూ కనిపించకుండా పోయారు. 
 
అప్పుడే తెలిసింది అసలు సంగతి. తన డబ్బు, బంగారు నగలతో ఉడాయించారని. వెంటనే వరుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు, నగల కోసమే పెండ్లి నాటకం ఆడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్నారు.