శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (13:40 IST)

కె.కవితకు సుప్రీంకోర్టులో ఊరట: బెయిల్ మంజూరు

Kavitha Kalvakuntla Arrest
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గంటన్నరపాటు సాగిన ఇరు తరపు వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ ఇచ్చింది. 
 
నిందితురాలు మహిళ అనే విషయాన్ని దృష్టిలో వుంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత నేడు బయటకు రానున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది.