బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:01 IST)

గోవధ వ్యతిరేక రాలీని అడ్డుకున్న ఖాకీ... రాళ్ళతో కొట్టిచంపిన నిరసనకారులు

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో గోవధ వ్యతిరేక ర్యాలీని ఓ పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు ఆ కానిస్టేబుల్‌ను కొట్టిచంపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీ రాష్ట్రంలోని బులంద్ షెహర్‌లో గోవధ జరిగినట్టు వార్తలు వచ్చాయి. దీంతో కొందరు స్థానికులు కలిసి గోవధ వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. 
 
దీనిపై బులంద్‌ షెహ‌ర్ జిల్లా మెజిస్ట్రేట్ అనుజ్ స్పందిస్తూ, డిసెంబరు 3వ తేదీ సోమవారం ఉదయం ఆందోళ‌న‌కారులు ఆందోళ‌న‌కు దిగారు. వాళ్లంతా రోడ్డుపై నిర‌స‌న వ్య‌క్తంచేశారు. పలు వాహనాలకు నిప్పు అంటించారు. విధ్వంసకాండ సృష్టించారు. అయితే వాళ్ల‌ను అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులుపై రాళ్లు రువ్వార‌ు. ఈ క్రమంలో ఎస్హెచ్ఓ సుబోధ్ కుమార్ గాయపడి ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించేపనిలో ఉన్నట్టు తెలిపారు.