సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (23:32 IST)

సీబీఎస్ఈ కీలక ప్రకటన.. ఏప్రిల్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం

కరోనా లాక్‌డౌన్‌కు అనంతరం పాఠశాలలన్నీ తెరుచుకుంటున్నాయి, విద్యార్థులను తరగతులకు స్వాగతం పలకాల్సిన సమయం వచ్చిందని సీబీఎస్ఈ తెలిపింది. ఇంకా తొమ్మిది, 11వ తరగతులకు సంబంధించి సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. 
 
'2021-22 విద్యా సంవత్సరం 2021 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు లోబడి సాధ్యమయ్యేంతవరకు ప్రారంభించడం సముచితం" అని సీబీసీఎస్ఈ ఆ నోటీసులో పేర్కొంది. ఇంకా 9, 11వ తరగతులకు కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పరీక్షలు విద్యార్థులు తదుపరి తరగతులకు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారనేది తెలుస్తుందని వెల్లడించింది. 
 
అంతేగాక, వచ్చే ఏప్రిల్ 1 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు కూడా ప్రారంభించాలని స్పష్టం చేసింది. పాఠశాలలు వ్యక్తిగతంగా విద్యార్థులపై దృష్టి పెట్టాలని, అభ్యాస అంతరాలను తగ్గించడానికి ప్రయత్నించాలని బోర్డు సూచించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు దాదాపు ఏడాదిగా తెరుచుకోని విషయం తెలిసిందే.