శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (15:39 IST)

జైలులో ఆప్ మంత్రికి మసాజ్.. వీడియో వైరల్

minister massage
ఢిల్లీలో ఓ వీడియో ప్రకంపనలు రేపుతోంది. ఢిల్లీ అధికార పార్టీకి చెందిన మంత్రి సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఒకటి లీక్ అయింది. ఇది ఇపుడు ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.
 
మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన సత్యేందర్ జైన్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్నారు. ఈయన ఉండే గదిలో సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చారు. అయితే, గదిలో ఆయన మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆయన పాదాలకు ఓ వ్యక్తి మసాజ్ చేస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 
 
తీహార్ జైలులో సత్యేందర్ జైన్‌‍కు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ ఈడీ ఇప్పటికే ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. నేపథ్యంలో తీహార్ జైలులోని సెల్-4 బ్లాక్‌ ఏ లోని సీసీటీవీ ఫుటేజీ ఇపుడు బహిర్గతం కావడం గమనార్హం. అయితే, ఈ మసాజ్ ఫుటేజీని నిలుపుదల చేయాలంటూ సత్యేందర్ జైన్ ఆగమేఘాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.