మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (11:57 IST)

యూపీ ఘజియాబాద్ జైలులో 140 మంది హెచ్ఐవీ రోగులు

jail
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జైలులో 140 మందికి హెచ్.ఐ.వి. వైరస్ సోకిందని జైలు ఉన్నతాధికారులు తెలిపారు. గత 2016లో ఈ జైలుకు వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయించగా 49 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అప్పటి నుంచి వీరంతా ఇతర ఖైదీలతో కలిసి ఉంటున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 140కు చేరిందని అధికారులు తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకినట్టు వెల్లడైంది. అదేసమయంలో హెచ్.ఐ.వి. సోకిన రోగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు వారు తెలిపారు. 
 
నిజానికి ఈ జైలులో 1706 మంది ఖైదీలు ఉండాల్సివుండగా, ఈ సంఖ్య 5,500కి చేరుకుంది. ఫలితంగా జైలులో అంటు వ్యాధులతో పాటు రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేసే వైరస్ సోకినవాళ్లు సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు వెల్లడించారు. హెచ్.ఐ.వి. ముదిరి ఎయిడ్స్‌గా మారుతుందని దీనికి పూర్తి స్థాయిలో చికిత్స లేదని తెలిపారు.