శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2022 (17:52 IST)

జామ పండు దొంగతనం చేశాడనీ కొట్టి చంపేశారు.. ఎక్కడ?

beaten to death
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జామపండు దొంగిలించాడన్న అక్కసుతో ఓ యువకుడిని కొందరు కొట్టి చంపేసారు. దీంతో తోట యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని అలీగఢ్ జిల్లా మానేనా గ్రామానికి చెందిన దళిత యువకుడు ఓం ప్రకాష్ గ్రామం పక్కనే ఉన్న అడవికి వెళ్ళి తిరిగి వస్తుండగా, జామ తోటలో కిందపడిన ఓ పండును తెచ్చుకున్నాడు. ఆ యువకుడు గ్రామంలోకి వస్తున్న ఓం ప్రకాష్‌ను జామతోట యజమానులు భీంసేన్, బన్సారీ గమనించి నిలదీశారు. ఆపై మిగతా గ్రామస్థులంతా కలిసి ఓం ప్రకాష్‌పై దాడి చేశారు. 
 
తోటలో జామకాయలు దొంగిలంచారన్న ఆరోపిస్తూ విచారక్షణా రహితంగా కొట్టారు. ఈ దెబ్బలు తట్టుకోలేక ఓం ప్రకాష్ అచేతన స్థితిలోకి జారుకోగా, అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో దళిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.