గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (14:47 IST)

నీది చెత్త ఆలోచన.. నీ మనస్తత్వం ఇంతే అంటూ.. భార్యను వీడియో తీసిన భర్త...

suicide
కట్టుకున్న భార్య తన కళ్ల ఎదుటే మెడకు ఉరితాడు బిగుంచుకుంటుంటే ఆపాల్సిన భర్త... ఆమెను వెటకారంగా మాట్లాడాడు. "నీది చెత్త ఆలోచన... నీ మనస్తత్వం ఇంతే అంటూ" అంటూ మాట్లాడాడే గానీ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని వేలాడుతుంటే వీడియో తీసి పెట్టుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుందంటూ ఫిర్యాదు చేశాడు. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కాన్పూర్‌కు చెందిన సంజయ్ గుప్తా, శోభితా గుప్తా అనే దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మంగళవారం గొడవ జరిగింది. దీంతో నీ వద్ద కాపురం చేయడం కంటే చావడం మేలంటూ భర్తపై కోపగించుకున్న శోభిత.. ఇంట్లోనే ఫ్యానుకు తన చున్నీతో ఉరేసుకుంది. ఆ సమయంలో భార్యను వారించాల్సిన భర్త.. వేడుక చూస్తూ ఉండిపోయాడు. 
 
పైగా, తన మొబైల్ ఫోనులో వీడియో తీశాడు. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పటికీ నమ్మని సంజయ్ గుప్తా... అత్తమామలకు ఫోన్ చేసి మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుందంటూ చెప్పాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.