బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (23:17 IST)

మునుగోడు.. ఫోక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన కేఏ పాల్

ka paul
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ హోటల్‌‌ నిల్చుని వంట చేస్తూ.. జనాలను ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. తాజాగా ఓ ఫోక్ సాంగ్‌‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. 
 
చుట్టూ జనం గుమికూడగా, తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో అందరికీ వినోదం పంచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. 
 
దీపావళి సందర్భంగానూ మునుగోడు నియోజకవర్గంలో కేఏ పాల్ సందడి చేశారు. లోకల్‌గా ఓ సెలూన్‌లో హెయిర్ కట్ చేయించుకున్నారు. ఓటర్లకు మిఠాయిలు, మంచినీళ్ల బాటిళ్లు పంచారు. ప్రస్తుతం డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.