మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (12:48 IST)

కిరణ్ రాథోడ్: వీడియో కాల్‌లో మాట్లాడాలంటే రూ.14 వేలు కట్టాలి

Kiran Rathod
Kiran Rathod
జెమిని ఫేమ్ హీరోయిన్ కిరణ్ రాథోడ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఫ్యాన్స్‌తో కిరణ్ రాథోడ్ మాట్లాడే వీలు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా ఆవిష్కరించింది. తన అభిమానులు మాట్లాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని కిరణ్ తేల్చి చెప్పింది. 
 
ఆ యాప్‌లో లాగిన్‌ అయిన వారు మాత్రమే ఆమెతో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. అదీకూడా ఉచితం మాత్రం కాదు. డబ్బులు చెల్లించాల్సిందే. సోషల్‌ మీడియాలో తనకున్న ఫాలోయర్ల సంఖ్యతో కొత్త బిజినెస్‌ ప్రారంభించారు. ఆమె క్రియేట్‌ చేయించుకున్న యాప్‌లో తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. వీటిని చూడాలని భావించే వారు యాప్‌లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. లాగిన్‌ అయ్యేందుకు రూ.49 చెల్లించాలి. 
 
ఆ తర్వాత రూ.1000 చందా చెల్లించి కిరణ్‌ రాథోడ్‌ ఫుల్‌ ఎక్స్‌పోజింగ్‌ గ్లామర్‌ ఫొటోలను చూడొచ్చు. అలాగే, ఈ యాప్‌ ద్వారా 5 నిమిషాల పాటు తనతో మాట్లాలని భావించే వారి నుంచి 10 వేల రూపాయలను వసూలు చేస్తుంది. 
 
15 నిమిషాల పాటు వీడియో కాల్‌లో మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాల పాటు మాట్లాడాలంటే రూ.25 వేలు చొప్పున చెల్లించుకోవాల్సి ఉంటుంది.