శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2022 (14:49 IST)

సుశాంత్ సింగ్ స్నేహితురాలు- టీవీ నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య

vaishali takkar
బాలీవుడ్ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇది బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం చెలరేగింది. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన వైశాలి... గత యేడాదికాలంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉంటున్నారు. ఆమె తన ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టు తేజాజీ నగర్ పోలీసులు వెల్లడించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఆమె స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని. వైశాలీ టక్కర్ "ససురల్ సిమర్ కా" లో అంజలి భరద్వాజ్, "సూపర్ సిస్టర్స్‌"లో శివానీ శర్మ, "విషయా అమృత్ సితార"లో నేత్రా సింగ్ రాథోడ్, "మన్మోహిని-2"లో అనన్య మిశ్రా వంటి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వైశాలి టక్కర్ ఉన్నట్టుండి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. అయితే, ఈమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.