1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (18:52 IST)

స్టేజీ మీద మాట్లాడుతూ.. కుప్పకూలిన రిటైర్డ్ ప్రొఫెసర్.. గుండెపోటుతో?

proffessor
proffessor
స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. ఓ ప్రొఫెసర్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. అప్పటివరకు ఉత్సాహంగా వేదికపై మాట్లాడిన ప్రొఫెసర్ వున్నట్టుండి పడిపోయారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... బీహార్, చప్రా జిల్లాలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వేదికపై కుప్పకూలిపోయారు. ఆయన కుప్పకూలడంతో అందరూ షాక్ అయ్యారు. 
 
అంతలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన రిటైర్డ్ ప్రొఫెసర్ రణంజయ్ సింగ్ మారుతీ మానస్ దేవాలయానికి ప్రధాన కార్యదర్శిగా వున్నారు. 
 
రణంజయ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్టేజీపై మాట్లాడుతుండగా కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.