శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (14:01 IST)

బిగ్ బాస్ సీజన్ 6: ఫైమా కెప్టెన్.. ఎలిమినేట్ అయ్యాదెవరు?

Bigg Boss 6
బిగ్ బాస్ హౌస్‌లో కంటిస్టెంట్ల మధ్య వార్ మామూలుగా లేదు. ఫైమా కెప్టెన్ కావడం.. ఇనయా జైలుకు వెళ్లడం ఈ రోజు ప్రత్యేకత. థార్మాకోల్ ఆ టలో ఫైమా గెలిచి కెప్టెన్ అయ్యింది. 
 
ఫైమా గెలుపుకు ఆదిరెడ్డి సపోర్ట్ అని ఇనయా ఆరోపించింది. దీంతో ఫైమా, ఆదిరెడ్డి ఫైర్ అయ్యారు. అలాగే రేవంత్- శ్రీసత్యల మధ్య వార్ జరిగింది. ఆపై ఎలిమినేషన్ టాస్క్ మొదలైంది. 
 
పోటీదారులలో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరనేది చెబుతూ వారి ముఖంపై రెడ్ కలర్ క్రాస్ మార్క్ వేయమని బిగ్ బాస్ ఆదేశాల మేరకు.. రేవంత్ ముఖంపై శ్రీసత్య క్రాస్ మార్క్ వేసింది. థర్మాకోల్ బాల్స్ ఆటలో సంచాలకుడిగా రేవంత్ ఫెయిలయ్యాడంటూ ఆరోపించింది. 
 
ఇలా ఈ వారం వరస్ట్ కంటెస్టెంట్ ఎవరనే విషయంలో ఎవరికి వారు, ఎదుటివారిలోని లోపాలను చెబుతూ వెళ్లారు. చివరికి చూస్తే ఎక్కువమందిచే క్రాస్ మార్క్ పడిన సభ్యురాలిగా ఇనయా నిలిచింది. దీంతో ఆమెను జైలులో పెట్టారు. 
 
ఇకపోతే.. ఈ వారంలో మొత్తం 9 మంది నామినేషన్ లిస్టులో వున్నారు. రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయ, కీర్తి, ఫైమా, వాసంతి, బాలాదిత్య, మెరీనా వీళ్లంతా నామినేషన్స్‌లో ఉండగా.. బాలాదిత్య, మెరీనా బిగ్ బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయినట్లు సమాచారం.