బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (19:12 IST)

సినిమా హాళ్లల్లో విరామ సమయంలో షార్ట్ ఫిల్మ్‌లు

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే విధించే శిక్షల గురించి షార్ట్‌ఫిల్మ్‌లను సినిమా విరామ సమయంలో ప్రసారం చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్ర‌యోగాత్మంగా మొద‌ట ఢిల్లీలోని 11 థి

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే విధించే శిక్షల గురించి షార్ట్‌ఫిల్మ్‌లను సినిమా విరామ సమయంలో ప్రసారం చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్ర‌యోగాత్మంగా మొద‌ట ఢిల్లీలోని 11 థియేట‌ర్ల‌లో ఈ వీడియోల‌ను ప్ర‌సారం చేసి, త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్ల‌లో అమ‌లు చేయ‌నున్నారు. ఈ డాక్యుమెంట‌రీ వీడియోల‌ను జాతీయ‌ బాల‌ల హ‌క్కుల ర‌క్ష‌ణ క‌మిష‌న్ రూపొందిస్తోంది. 
 
ఇటీవ‌ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేప‌థ్యంలో.. వాటి గురించి ఫిర్యాదు చేసే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినిమా హాళ్లలో అందుకు సంబంధించి వీడియో ప్రసారం చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ యత్నిస్తోంది. సినిమా ప్రారంభానికి ముందు ఈ వీడియోల‌ను ప్ర‌సారం చేయ‌డం ద్వారా ఫిర్యాదు చేసే విధానాల గురించి ఎక్కువ మందికి అవ‌గాహన ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని ఆ శాఖ భావిస్తోంది.