బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (10:31 IST)

3 గంటలు ఆలస్యమైతే విమానం రద్దు.. ఎందుకో తెలుసా?

flight
ఉత్తర భారతావనిని పొగమంచు కమ్మేసింది. దీంతో అన్ని రకాల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా, విమాన, రైళ్ల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాతావరణం అధ్వాన్నంగా ఉన్న సమయంలో విమాన సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 
 
అధ్వాన వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా మంచు ఎక్కువగా ఉన్న సమయాల్లో విమానయాన సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, తమ కార్యకలాపాల నియంత్రణ కేంద్రాల(ఓసీసీ)ను బలోపేతం చేసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. గత రెండు నెలలుగా విమానయాన సంస్థలు, విమానాశ్రయ ఆపరేటర్లతో మంత్రిత్వశాఖ వరుసగా చర్చలు జరిపాక తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. 
 
ఒక విమానం మూడు గంటలకు మించి ఆలస్యమైన పక్షంలో విమాన సర్వీసును రద్దు చేయాలని, ఆలస్యమైన విమానం లోపల ప్రయాణికులను 90 నిమిషాల కంటే ఎక్కువగా కూర్చోపెట్టరాదనీ, తద్వారా వారికి అసౌకర్యాన్ని తగ్గించొచ్చు. తర్వాత రీబోర్డింగ్ ప్రక్రియ సులభతరంగా ఉండేలా చూసుకోవాలని సూచన చేసింది. 
 
మంచు బారినపడిన విమానాశ్రయాల్లో సమర్థంగా సేవలను అందించడం కోసం క్యాట్ /క్యాట్ 3 సిబ్బందిని సరిపడా నియమించుకోవాలి. ఇందుకు డీజీసీఏతో విమానాశ్రయాలు సమన్వయం చేసుకోవాలని కోరింది. విమాన ప్రయాణికులతో కంపెనీలు సర్వీస్ ఆలస్యం, రద్దు అంశాల్లో సమాచారాన్ని సరిగ్గా పంచుకోవాలని స్పష్టం చేసింది.