శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (17:59 IST)

ఇండిగో విమాన సేవలు రోజురోజుకూ దిగిపోతున్నాయి : శృతిహాసన్

shruthi haasan
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో విమాన సంస్థపై సినీ హీరోయిన్ శృతిహాసన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇండిగో విమాన సేవలు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
తాను ఎక్కాల్సిన విమానం ఏకంగా 4 గంటల పాటు ఆలస్యమైందని, ఈ చర్య అసహనం వ్యక్తం చేశారు. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయనని చెప్పిన ఆమె... కానీ ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో విమానయాన సంస్థ రోజురోజుకీ దిగజారుతోందని తన ట్వీట్లో రాసుకొచ్చారు.
 
తనతోపాటు పలువురు ప్రయాణికులు ఎయిర్ పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తూ 4 గంటల పాటు ఉండిపోయామని శృతిహాసన్ తెలిపారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం ఆలస్యం విషయమై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. ఇకనైనా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా విమానయాన సంస్థ తన సర్వీసులను మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు.
 
ఇక శృతిహాసన్ ట్వీట్‌పై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఆలస్యమైందని తెలిపింది. ఈ విషయాన్ని శృతిహాసన్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఇండిగో పేర్కొంది. అయితే, ఇండిగో సమాధానాన్ని పలువురు నెటిజన్లు విమర్శించారు. ప్రతికూల వాతావరణం ఉంటే ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని దుయ్యబట్టారు. ఉన్న విషయం చెబితే ప్రయాణికులు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.