శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (11:50 IST)

సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌గా శరద్ అర్వింద్ బాబ్డే.. సిఫార్సు చేసిన సీజేఐ

భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బాబ్డే నియమితులుకానున్నారు. ఆయన పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ జస్టీస్‌లలో బాబ్డే మొదటిగా ఉన్నారు. దీంతో ఆయన పేరును సీజేఐ సిఫార్సు చేశారు. 
 
సుప్రీంకోర్టు సాంప్రదాయం ప్రకారం తన తదుపరి వారసుడిని ప్రస్తుత సీజేఐ ప్రతిపాదించాలి. దీంతో ఎస్‌ఏ బాబ్డేను సీజేఐగా నియమించే చర్యలను ప్రారంభించాల్సిందిగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో రంజన్‌ గగోయ్‌ కోరారు. గగోయ్ నవంబరు 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న విషయం తెల్సిందే. 
 
బాబ్డే 24 ఏప్రిల్‌, 1956న నాగ్‌పూర్‌లో జన్మించారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పనిచేశారు. మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా సేవలందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.