1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (11:17 IST)

గంగానది ప్రక్షాళనకు 18 ఏళ్లు పడుతుంది: సుప్రీంకు కేంద్రం

పవిత్ర గంగానది ప్రక్షాళనపై కేంద్రం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ సమయంలో వేలాది కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతాయని చెప్పింది. ఈ మేరకు రూపొందించిన బృహత్ ప్రణాళికను కోర్టుకు సమర్పించింది.
 
స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలతో తయారుచేసిన నమూనా ప్రణాళికను అఫిడవిట్ రూపంలో ఇచ్చింది. నదీ తీరం వెంబడి 2,500 కిలో మీటర్ల పొడవునా 118 పట్టణాల్లో సంపూర్ణ స్థాయిలో పారిశుద్ధ్య పరిస్థితులను నెలకొల్పడం తమ మొదటి లక్ష్యమని ప్రభుత్వం వివరించింది.