మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 3 మే 2018 (09:15 IST)

కాంగ్రెస్‌ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదు : సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. కంప్లి నియోజకవర్గం పరిధిలోని కురుగోడు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభలో సీఎం సిద

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. కంప్లి నియోజకవర్గం పరిధిలోని కురుగోడు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభలో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో తమ వంతుగా అన్నివర్గాలకు ఉత్తమ పాలన అందించామన్నారు. రాష్ట్రంలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందుతారన్నారు.
 
రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షాలు ఎన్ని పర్యటనలు చేసినా, ఎలాంటి ప్రయోజనం లేదని, నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు నెరవేర్చలేదని, నోట్లు బదిలీ, జీఎసీటీ విషయంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడినా పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. రైతులకు రుణమాఫీ తమ వంతుగా చేశామన్నారు. తాము చేసిన అభివృద్ధి పథకాలే ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపునిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.