ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 31 మే 2021 (17:51 IST)

గంగానదిలో కొట్టుకొస్తున్న కరోనా మృతుల శవాలు

ఉత్తరప్రదేశ్ లోని గంగానదిలో మరోసారి కరోనా మృతుల శవాలు నీటిపై తేలియాడుతూ కొట్టుకురావడం కలకలం సృష్టిస్తోంది. ఉన్నావ్ జిల్లాలోని గంగానదిలో ఆదివారం నాడు పెద్దఎత్తున మృతదేహాలు నదీ ప్రవాహంలో కొట్టుకురావడాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.
 
అంతకుముందు నది ఒడ్డున ఖననం చేసిన శవాలు, నదీ ప్రవాహానికి కొట్టుకు వస్తున్నాయని స్థానికులు అనుకుంటున్నారు. కాగా ఉన్నావ్ జిల్లాలో శవాలు కొట్టుకురావడం వంటి సంఘటనలు జరగలేదని అధికారులు చెపుతున్నారు. అక్కడ నిరంతరం పోలీసులు గస్తీ తిరుగుతున్నారని చెప్పారు.
 
ఐతే అధికారులు అలా చెపుతున్నప్పటికీ శవాలు మాత్రం నదిలో కొట్టుకుని వస్తున్నాయని ప్రజలు చెపుతున్నారు. గంగా నదీ పరివాహక ప్రాంతంలో వున్న బీహార్ రాష్ట్రానికి చెందిన జిల్లాల్లోని కొన్నిచోట్ల ఇలాగే శవాలు తేలుతూ వస్తున్నట్లు చెపుతున్నారు.