శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (13:44 IST)

కరోనా లక్షణాలు.. మనస్తాపంతో ఏడవ అంతస్థు నుంచి దూకేశాడు

Corona Suicide
దేశ వ్యాప్తంగా 150 మందికి పైగా కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఓ యువకుడు తనకు కరోనా వైరస్ లక్షణాలుండటం గమనించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిడ్నీ నుంచి ఢిల్లీకి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి తనకు కరోనా లక్షణాలుండటాన్ని కనుగొన్నాడు. వెంటనే అతనికి ఢిల్లీలోని ఆస్పత్రి చికిత్స ఇవ్వడం కూడా జరిగింది. 
 
కరోనా వైరస్ లక్షణాలుంటే వైద్యుల పర్యవేక్షణలో వుండాలని.. పాజిటివ్ అని తేలితే.. ఆపై 14 రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి బుధవారం రాత్రి ఏడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆస్పత్రి వైద్యులు, నర్సులు షాకయ్యారు.