సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (12:40 IST)

జార్జియా ఎయిర్‌పోర్టులో స్పృహ కోల్పోయిన తెలుగమ్మాయి... ఎందుకని?

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి చెందిన వెంకటేష్ సరిత దంపతుల కూతురు శివాణి పై చదువుల కోసం జార్జియా దేశం వెళ్ళింది. కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో ఒకసారి వాంతి చెసుకొని అపార్మరక స్థితిలో వెళ్ళింది. అది గమంచిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బ్రెయిన్‌లో బ్లెడ్ గడ్డకట్టింది విద్యార్థుల తెలపడంతో వెంటనే శివాణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకొని జార్జియా నుంచి కూతురు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
జార్జియా నుంచి వచ్చే సమయంలో ఎయిర్ ఫోర్ట్ సబ్బంది చివరి నిమిషంలో శివాణి ప్రయాణించేందుకు నిరాకరించారు. ప్రాణాపాయం ఉన్న కూతురు శివాణి ఇండియా రావడానికి అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో రాకుండా అడ్డుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.