శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (10:35 IST)

కరోనా వైరస్ విజృంభణ.. 49లక్షల మార్కును తాకిన కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 49లక్షల మార్క్‌ను దాటింది. కేసుల సంఖ్య పెరుగుతున్నా అదే స్థాయిలో బాధితులు కోలుకుంటున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 83,809 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,30,237కు చేరింది.
 
దేశవ్యాప్తంగా సోమవారం ఒకే రోజు 10,72,845 టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) చెప్పింది. ఇప్పటి వరకు 5,83,12,273 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.
 
ప్రస్తుతం 9,90,061 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 38,59,400 మంది వైరస్‌ ప్రభావం కోలుకున్నారని తెలిపింది. వైరస్‌ ప్రభావంతో తాజాగా మరో 1,054 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మహమ్మారి కారణంగా 80,776 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది.