గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (16:28 IST)

చాపకింద నీరులా కరోనా వ్యాప్తి - నెల రోజుల్లో ఆరు రెట్లు పెరుగుదల

coronavirus
దేశంలో కరోనా వైరస్ కేసులు చాప కింద నీరులా పెరిగిపోతున్నాయి. గత ఆరు రోజుల్లో ఆరు రెట్లు పెరిగాయి. ఈ నెల 18వ తేదీన 112గా ఉన్న పాజిటివ్ కేసులు తాజాగా ఈ కేసుల సంఖ్య 841కు చేరింది. అంటే 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆరు రెట్లు పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5389కి చేరినట్టు తెలిపింది. 
 
ఈ వైరస్ బారినపడిన వారిలో జార్ఖండ్ రాష్ట్రంలో ఒకరు, మహారాష్ట్రంలో ఒకరు చనిపోయారని, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఈ పాజిటివ్ కేసుల నమోదు అధికంగా ఉందని తెలిపింది. మరోవైపు, ఈ కేసుల బారినపడుతున్న వారి సంఖ్యతో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.